శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మంజీర డైమండ్ హైట్స్ లో స్థానిక ప్రజా సమస్యలపై గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీ వీధుల్లో పర్యటించి అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లను పూర్తి చేయాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ల పనులకు ఇప్పటికే నిధులు శాంక్షన్ అయ్యాయి , త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని భరోసా ఇచ్చారు.

అనంతరం తమ కాలనీలోని హనుమాన్ పార్క్‌లో యోగా, ధ్యాన కార్యక్రమాల కోసం ప్లేన్ ప్లాట్‌ఫామ్‌తో పాటు షెడ్ ఏర్పాటు చేయడం, టాటా స్పోర్ట్స్ పార్క్‌లో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేలా బ్యాంక్ క్రికెట్ సదుపాయం కల్పించడం, ట్రీ పార్క్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో పాటు చిన్నారుల కోసం చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, విశ్రాంతికి బెంచీలు, అన్ని వయస్సుల వారికి ఉపయోగపడే వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కోరారు. ఈ అంశాలపై తక్షణమే స్పందించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అక్కడే ఉన్న అధికారులకు అన్ని సమస్యలను నోట్ చేయించి, అవసరమైన నిధులు కేటాయించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, మంజీరా డైమండ్ హైట్స్ అధ్యక్షుడు పి ఆర్ రావు , ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సుందర చారి, జాయింట్ సెక్రెటరీ సుమంత్, కాలనీ వాసులు, మనోజ్, రామచంద్ర రెడ్డి, గోవర్ధన్, మదన్, రాకేష్, గోపాల్, శేఖర్ రెడ్డి, శశి, రజని, హేమ, సీనియర్ నాయకులు శేఖర్, సుమన్, వెంకటేష్, రంగస్వామి, చిన్నా, నర్సింగ్ రావు, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





