శేరిలింగంపల్లి, జనవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): సందయ్య మెమోరియల్ ట్రస్ట్, RKY ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాయదుర్గం జెడ్పీహెచ్ ప్రభుత్వ పాఠశాల, ఖాజాగూడ జెడ్పీహెచ్ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఆలిన్ వన్ స్టడీ మెటీరియల్ ను బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి, ట్రస్ట్ సెక్రటరీ, ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ యాదవ్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని, విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి, తల్లిదండ్రులకు , గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు ,పేద విద్యార్థులకు సహాయం చేయడానికి తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందంజ లో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, నరేందర్ ముదిరాజ్, దయాకర్, అమర్, సురేందర్, శ్యామ్ యాదవ్, ఇందిరా, దుర్గా రామ్, పద్మ, అరుణ్, కిషోర్, సుధ, రాజేశ్, కిరణ్ , కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.






