అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రూ. 4 కోట్ల 35 లక్షల వ్యయంతో శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. లింగంపల్లి విలేజ్, రాజీవ్ గృహకల్ప, నెహ్రూనగర్, గుల్మోహర్ సిగ్నల్, మసీద్ బండ, రోలింగ్ మీడోస్, స్ప్రింగ్ వ్యాలీ లలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు, కమిటీ హాల్, రోడ్డు వైడెనింగ్, ప్రహరీ గోడ, వాకింగ్ ట్రాక్, పలు అభివృద్ధి పనులకు పీఏసీ ఛైర్మ‌న్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెక‌పూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, కాంగ్రెస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, బస్తీ కమిటీ మెంబర్స్, బూత్ కమిటీ మెంబర్స్, మహిళా నాయకురాళ్లు, యువ నాయకులు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here