శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై అధికారులకు వివరించడం జరిగిందని కాలనీ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ తెలిపారు. నేతాజీ నగర్ కాలనీలో జనాభా పెరుగుతున్నదని కరెంటు వాడకం పెరుగుతున్నా, వోల్టేజ్ సమస్య అధికంగా ఉందని అధికారులకు వివరించారు. ముఖ్యంగా కాలనీలో కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులకు ఏడీ ఈ శివ ప్రసాద్ కి వినతిపత్రం ఇచ్చారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే కరెంటు సమస్య లేకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్లు అమర్చి విద్యుత్ సమస్యలు ఉంటే సమస్యను పూర్తిగా నివారిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కే నరసింహ యాదవ్, ప్రసాద్ యాదవ్, రాఘవేంద్ర శర్మ, మౌలానా, తెలుగు సుభాష్ ముదిరాజ్, మణికట్ట,అసోసియేషన్ సభ్యులు, Sub Eng కిషోర్, శ్యామ్, S.V రాజు, రమేష్, నరేష్, పద్మారావు, రవీందర్, చరణ్, అశోక్, బాలస్వామి పాల్గొన్నారు.






