శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): మాఘశుద్ధ విదియ శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పూజ రోజు సందర్భంగా హుడా కాలనీ లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కుంకుమార్చన, అభిషేకం, హోమాలను నిర్వహించారు. IVF గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ వాసవి ఐక్యవేదిక, శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఆర్యవైశ్య ప్రముఖులు పబ్బమల్లేష్ గుప్తా, పోల సాయిబాబా గుప్తా, గంప సత్యం గుప్తా, పసుమర్తి శ్రీనివాస్ గుప్తా, దారం లక్ష్మయ్య గుప్తా, సంపత్ కుమార్ గుప్తా, వనమా శ్రీనివాస్ గుప్తా, బాదం చిన్నం సత్యనారాయణ గుప్తా, సాయిబాబా గుప్తా, పబ్బా శ్రీనివాస్ గుప్తా, నటరాజ్ గుప్తా, పబ్బ భరత్ గుప్తా, భాస్కర్ గుప్తా, నాగరాజ్ గుప్తా, సోమ రమేష్ గుప్తా, శేషగిరి రావు గుప్తా, పబ్బా సాంబశివ మూర్తి, పబ్బ జయ కృష్ణ గుప్తా, మోహనరావు గుప్తా, లక్ష్మీనారాయణ గుప్తా, సీత గుండయ్య గుప్తా, రాముని లలిత గుప్తా పాల్గొన్నారు.






