శేరిలింగంపల్లి, జనవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి(పార్ట్), వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కూకట్పల్లి జోన్ జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఆయా డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని అన్నారు.

అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. నూతనంగా ఏర్పడిన ఆల్విన్ సర్కిల్, మాదాపూర్ సర్కిల్ కార్యాలయంల కోసం నూతన భవనాలు నిర్మించేందుకు స్థలాలను పరిశీలించడం జరిగిందని, స్థలాల కేటాయింపు, భవనాల నిర్మాణం కోసం తీసుకోవాల్సిన విధివిధానాలపై చర్చించడం జరిగిందని, కొత్త సర్కిల్ కార్యాలయాల భవనాలు త్వరితగతిన నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ప్రజలందరికి అందుబాటులో ఉండే విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన సర్కిల్ కార్యలయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన నిర్మించి త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. అసంపూర్తిగా మిగిలోపోయిన నాలాల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని,అసంపూర్తిగా మిగిలిపోయిన పరికి చెరువు అలుగు నుండి ధరణి నగర్ నగర్ నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని PAC చైర్మన్ గాంధీ తెలిపారు.
చెరువుల సుందరీకరణలో భాగంగా గుర్రపు డెక్కను తొలగించాలని, హైదర్ నగర్ అలీ తలాబ్ చెరువు, అంబీర్ చెరువు, ఎల్లమ్మ చెరువు, పరికి చెరువులలో పేరుకుపోయిన గుర్రపు డెక్క ను తొలగించాలని, చెరువుల సుందరీకరణ పనులలో వేగం పెంచాలని, పార్క్ ల అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు. అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు SE చిన్నా రెడ్డి, EE గోవర్ధన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.





