శేరిలింగంపల్లి, జనవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల పరిధిలోని త్రివేణి పాఠశాలలో ఆర్‌సీ పురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌ను పాటించడంపై, రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇదే అంశంపై విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ రామ్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం చిత్ర లేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ పోటీల్లో పుర్భాషా జనా అనే విద్యార్థి ప్రథమ బహుమతిని సాధించగా, టి.శివానికి ద్వితీయ బహుమతి దక్కింది. మూడో బహుబతిని పి.వీరజ్ గౌడ్ సాధించాడు. ఈ ముగ్గురు పాఠశాలలో 9వ తరగతి విద్యను అభ్యసిస్తున్నారు.

కాగా ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని, దీంతో వారు భావి భారత పౌరులుగా ఎదగడానికి దోహదపడతాయని త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాల సీఆర్‌వో సాయి నరసింహా రావు, ఏసీఆర్‌వో నరేష్, ప్రిన్సిపల్ అనితారావు, క్యాంపస్ ఇన్‌చార్జి శ్రీనివాస రావు పాల్గొన్నారు.






