శేరిలింగంపల్లి, జనవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హుడా కాలనీ వ్యాపారస్తుడు డి. రాధాకృష్ణ, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల ఆధ్వర్యంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. గత 30 సంవత్సరాల నుంచి వారు ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండడం విశేషం. భారతదేశ సాంస్కృతి, సాంప్రదాయాలు ప్రతింబించేలా వివిధ అంశాలతో కొన్ని వేల బొమ్మలతో , ధర్మ , దేవాలయ విశేషాలను తెలిసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం RSS 100 వసంతాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా నిత్య శాఖ స్వరూపాన్ని బొమ్మల కొలువు ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ , డివిజన్ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు , డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, ఇతరులు పాల్గొన్నారు.







