శేరిలింగంపల్లి, జనవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ భోగి , సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి పర్వదినం సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తన నివాసంలో జరిగిన భోగి వేడుకలలో పాల్గొని భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు , కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేయడం ఆనవాయితీ అని, ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారని అన్నారు. ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారని, అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి, కొత్తమార్గంలోకి పయనించాలని దీని అర్థం అని అన్నారు.






