జెపి నగర్ లో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 14 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): సంక్రాంతి పండుగ సందర్భంగా జెపి నగర్ లో నాయకుడు రామప్రభు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధమైన రంగోలి (ముగ్గు) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ పండుగ ఆనందాన్ని ప్రజల్లో పంచే ఉద్దేశంతో ముగ్గుల‌ పోటీల‌ను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. పోటీలో ఉత్తమంగా ప్రతిభ కనబరిచిన వారికి మూడు ఉత్తమ బహుమతులు, రెండు ప్రోత్సాహక బహుమతులు అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేయడం ద్వారా వారి ఉత్సాహాన్ని మరింత పెంచారు. ఈ సందర్భంగా రామప్రభు మాట్లాడుతూ సంక్రాంతి వంటి పండుగలు ప్రజలను ఐక్యంగా నిలబెట్టడంతో పాటు మన సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప అవకాశమని తెలిపారు. ఈ రంగోలి కార్యక్రమంలో జెపి నగర్ కాలనీ మహిళలు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here