- బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ హెచ్చరిక
శేరిలింగంపల్లి, జనవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమర్థ గ్రామపాలనకు- సర్పంచుల హ్యాండ్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డా. విశారదన్ మహరాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఈ బుక్ సర్పంచ్ లకు రాజ్యాంగం లాంటిదన్నారు. కులాలకతీతంగా సర్పంచ్ లందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. ఎంతో జ్ఞానం ఈ పుస్తకంలో పొందుపరిచి ఉందని, ప్రతి ఒక్క సర్పంచి ఈ పుస్తకం చదివి గ్రామ సుపరిపాలన కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బైరు శేఖర్ గంగపుత్ర, యెలికట్టె విజయకుమార్ గౌడ్, పాలకూరి అశోక్ , అంబాల నారాయణ గౌడ్ , బోయ గోపి , ఎర్ర మాధు వెంకన్న నేత , గోలి గిరి రజక , రాఘవేంద్ర ముదిరాజ్ , బడే సాబ్ , దామోదర్ గౌడ్, లింగేష్ యాదవ్ , పిల్లి సంజీవ్ మేదరి, నాగభూషణం బలిజ , చెన్నా శ్రీకాంత్ నేత, ఆవుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






