శేరిలింగంపల్లి, జనవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (AIFDW) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఆరోగ్యకరమైన నేర రహిత సమాజం కోసం, మద్యపానాన్ని నిషేధించాలని, మత్తుపదార్ధాలను నిర్మూలించాలని, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలనే నినాదాలతో ఈ పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ముగింపు ముగ్గుల పోటీలను నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ABN జర్నలిస్టు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతిని బి.నమృత దక్కించుకోగా, ద్వితీయ బహుమతి మన్నే మాధవిని వరించింది. అలాగే తృతీయ బహుమతిని అశ్వినికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘ నాయకులు, మియాపూర్ గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






