మహిళలు ఇంటి ముందు వేసే ముగ్గులు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి: బాలింగ్ లక్ష్మి గౌతమ్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హఫీజ్ పేట డివిజన్‌లోని ప్రజ‌య్‌ సిటీ అపార్ట్‌మెంట్స్‌లో నివాసితుల కోసం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల‌కు బాలింగ్ లక్ష్మి గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. పోటీల్లో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను బ‌హుమ‌తులుగా ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా బాలింగ్ లక్ష్మి గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని అన్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఇంటి ముందు వేసే ముగ్గులు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయ‌న్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ‌య్‌ సిటీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు శివ నాగమణి, సురేఖ, రమ్య, శారద, శివకుమారి, మాధవి, మౌనిక, శృతి, కుమారి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here