శేరిలింగంపల్లి, జనవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): స్వామి వివేకానంద 164 వ జయంతి సందర్భంగా మదీనాగూడ మైత్రి నగర్ కమాన్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి హఫీజ్‌పేట డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జితేందర్ , మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పూలమాలలు వేసి శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ యువతకి నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు తెలిపారు,.మన దేశానికి యువత అమూల్యమైన సంపద, దేశ అభివృద్ధి లో కీలక పాత్ర యువతదే అని అన్నారు. అతి చిన్న వయస్సులో 1893 లో స్వామి వివేకానంద పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ లో ప్రసంగించి మన దేశ సంస్కృతిని తత్వాన్ని ప్రవేశ పెట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశంలోని యువత లేకుండా మనం మార్పులు, పురోగతి సాధించలేమని , ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే యువతరం భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగులు గౌడ్, మహేష్ యాదవ్, మాణిక్ రావు, అజిత్ సేనాధిపతి, కోటేశ్వరరావు , మనోహర్, శ్రీధర్ గౌడ్, విష్ణు , సత్యనారాయణ రాజు, రమణయ్య , సురేష్, శ్రీనివాస్ యాదవ్ , రాజేష్ గౌడ్, గణేష్ ముదిరాజ్, శివారెడ్డి , విజయేందర్ , పట్టాభిరామ్, శివరాజ్ ముదిరాజ్, వినోద్ యాదవ్ , బాబు ముదిరాజ్ , రాము , వేణుగోపాల్ రెడ్డి, మహేందర్ యాదవ్ , రాము యాదవ్ , రెడ్డమ్మ, సాయి తదితరులు పాల్గొన్నారు.






