శేరిలింగంపల్లి, జనవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్పలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్, రాగం జాగృతి యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంతో రంగురంగుల ముగ్గులు వేసి సంక్రాంతి పండుగ వైభవాన్ని మరింత పెంచారు. ఈ సందర్భంగా ఆకర్షణీయంగా ముగ్గులు వేసిన మొదటి ముగ్గురు విజేతలు కృష్ణవేణి, మాధురి, పరమేశ్వరి లకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తరఫున నగదు బహుమతులు అందజేశారు. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సలేషన్ బహుమతులు ఇచ్చారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముగ్గులు మన సంస్కృతికి, కళాత్మకతకు ప్రతిరూపాలు, ఇంటి ముందు ముగ్గు వేయడం లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడమేనని, మన నమ్మకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, శారదా విద్యానికేతన్ ప్రిన్సిపల్ రోజీ, జడ్జెస్ తరుణం, సురేఖ, జబర్దస్త్ టీం వినోద్, సందయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ బస్వరాజ్, మోహన్, సోనీ, శ్రేయ, తన్వి, స్వప్న, మహిళా నాయకురాళ్లు చంద్రకళ, భాగ్యలక్ష్మి, కుమారి, జయ, సుధారాణి, జయమ్మ, లక్ష్మి, రోజరాణి, కళ్యాణి, రాములమ్మ, ఫాతిమ, గౌసియా, దేవి, కమల, సబియా, స్వాతి, చారీ, ఎల్లేష్, కుమార్ పాల్గొన్నారు.






