చందానగర్ డివిజన్‌లో ముగ్గుల పోటీలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని క్యాథి హోమ్స్‌లో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేట‌ర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. మహిళలు, యువత పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ,ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా మహిళల ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తాయని తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. క్యాథి హోమ్స్ వాసులు కార్యక్రమంలో పాల్గొని పోటీల విజయానికి సహకరించారు. రంగుల హరివిల్లుతో క్యాథి హోమ్స్ ప్రాంగణం కళకళలాడింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here