మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియ‌న్స్ కు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ స‌న్మానం

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కరీంనగర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో Women ఛాంపియన్, MEN ఛాంపియన్, ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిచిన, 80 సంవత్సరాల విభాగంలో 3 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న రాజరాజేశ్వరమ్మని, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా క్రీడాకారులందరినీ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాలతో సాదరంగా సత్కరించి పేరుపేరునా ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ విజేతలకు, పాల్గొన్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటూ క్రీడల్లో పాల్గొనడం చాలా అభినందనీయం అని అన్నారు. యువతకు ఆదర్శంగా నిలిచార‌ని, యువతతో పాటు పత‌కాలు సాధించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయం గా నిలిచార‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ రెడ్డి, జనరల్ సెక్రటరీ డి.లక్ష్మి, ట్రెజరర్ శ్రీలక్ష్మమ్మ, వైస్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్, స్టేట్ PATRON ఇగ్నైట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ రమేష్ , PATRONS కళ్యాణి, శ్రీదేవి, పద్మశ్రీ, సావిత్రి గోపాల్, చిరంజీవి రెడ్డి, గోపీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here