శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ మార్తాండ్ నగర్ కాలనీలో శ్రీ సిద్ది వినాయక మహిళా కమిటీ ఆధ్వర్యంలో కవిటి లక్ష్మి, శ్యామ్ దంపతులు ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ హాజరయ్యారు. పలువురు మహిళలు వేసిన రకరకాల రంగుల వల్లుల ముగ్గులను కార్పొరేటర్ హమీద్ పటేల్ పరిశీలించారు. కమిటీ సభ్యులతో కలసి విజేతలను నిర్ణయించారు. ఈ సందర్బంగా ముగ్గులు పోటీలో గెలిచిన పలువురు మహిళలకు కార్పొరేటర్ హమీద్ పటేల్ చేతులు మీదుగా బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముగ్గుల పోటీలలో మొదటి మూడు బహుమతులు గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలియజేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి, కవిటి లక్ష్మి, శ్యామ్, రవి రెడ్డి, గోవింద్, కవిత, భవాని, కౌసల్య, సువర్ణ, శాంతి, ప్రశాంతి, వరలక్ష్మి, సుజాత, అక్షయ, శృతి, భార్గవి, సంతోషి, మౌనిక పాల్గొన్నారు.






