కాలనీల అభివృద్ధికి విశేషంగా  కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జ‌న‌వ‌రి 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ సి బ్లాక్ లో నూతనంగా నిర్మించిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. అసోసియేషన్ కార్యాలయాన్ని కాలనీ సంక్షేమం , అభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆఫీస్ లో సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు , జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాలనీ అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here