ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. గోపనపల్లి తండా లోని ప్రజలు ఇటీవల తాము ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలతో కలిసి సమస్యలపై గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ పాదయాత్ర చేశారు . ప్రధానంగా డ్రైనేజీ పైప్ లైన్ సమస్య వల్ల మురుగునీరు నిలిచిపోతుందని, అదేవిధంగా మంచి నీటిలో లో-ప్రెషర్ సమస్య ఉందని, అలాగే వీధి దీపాలు మరికొన్ని ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు వాటిని నోట్ చేసుకొని వీలైనంత త్వరగా అందుకు అవసరమైన నిధులు కేటాయించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు శేఖర్, ప్రభాకర్, సుమన్, ప్రకాశ్, గిరి, నర్సింగ్, గోపాల్, మణికంఠ, శ్రీశైలం, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గౌలి దొడ్డిలో..

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదోడి లో స్థానిక ప్రజా సమస్యల పై గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీ వీధుల్లో పర్యటించి అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తమ కాలనీల‌లో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లను పూర్తి చేయాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు వాటిని నోట్ చేసుకొని వీలైనంత త్వరగా అందుకు అవసరమైన నిధులు కేటాయించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు కిషన్ గౌలి, సుమన్, ప్రకాశ్, గిరి, నర్సింగ్, గోపాల్, మణికంఠ, శ్రీశైలం, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, మహిళలు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here