శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్‌లో సీక్రెట్ లేక్‌గా పేరుగాంచిన దుర్గం చెరువులో జరిగిన ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. మాధాపూర్ ఇనార్బిట్ మాల్ వైపు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టితో నింపి పార్కింగ్‌గా వినియోగిస్తున్న సుమారు 5 ఎకరాల అక్రమ కబ్జాలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఒకప్పుడు 160 ఎకరాలుగా ఉన్న దుర్గం చెరువు ఆక్రమణల కారణంగా 116 ఎకరాలకు కుచించుకుపోయినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజావాణి ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టగా, చెరువు అసలు వైశాల్యాన్ని నిర్ధారించి మిగిలిన ఆక్రమణలను తొలగించే దిశగా హైడ్రా ముందుకెళ్తోంది.







