శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): వైకుంఠ ఏకాదశి పర్వదినంను పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడా విలేజ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారిని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , EO సత్యచంద్ర రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు , నాయకులకు, కార్యకర్తలకు వైకుంఠ ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. వైకుంఠ ఏకాదశి పండగ మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉట్ల కృష్ణ, రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దశరథ్, నర్సింహ యాదవ్, మాధవి, రమేష్ , మణి రత్నం, బాలమణి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






