శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): బిజెపి నుంచి నాగం వర్షిత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని బేరి రామచందర్ యాదవ్ హెచ్చరించారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో కలసి నల్గొండలో బీసీలపై జరుగుతున్న దాడులను శ్రావణ్ యాదవ్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ నల్గొండలో జరిగిన బీసీ నాయకుల మీద దాడిని పిల్లి రామరాజు యాదవ్ పై జరిగిన సంఘటనను ఖండిస్తూ నాగం వర్షిత్ రెడ్డిని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని, భవిష్యత్తులో బీసీలపై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. నల్గొండలో యాదవులపై ఎల్లమ్మ గూడెం, సోమరిగుడం, సూర్యాపేట వంటి ప్రాంతాలలో నిత్యం దాడులు జరుగుతున్నాయని ఈ దాడులను బీసీ సంఘాలు, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ యాదవ్, సందీప్ యాదవ్, లెనిన్ యాదవ్ , శశాంక్ యాదవ్ , క్రాంతి కుమార్, సంతోష్ కుమార్, సంపత్ కుమార్ యాదవ్, సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొని తీవ్రంగా ఖండించారు.






