ల‌య‌న్స్ క్ల‌బ్ సికింద్రాబాద్ నార్త్ సేవ‌లు అభినంద‌నీయం

  • డిస్ట్రిక్ట్ గ‌వ‌ర్న‌ర్ సెల్వా సాయిరాంరాజ్
  • క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో ఐదేళ్ళు పూర్తి, ఉచిత బ్రేక్ ఫాస్ట్ పంపిణీ కార్య‌క్ర‌మం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 28 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాలు అభినంద‌నీయ‌మ‌ని ల‌య‌న్స్ క్ల‌బ్ 320 బి డిస్ట్రిక్ట్ గ‌వ‌ర్న‌ర్ సెల్వా సాయిరాంరాజ్ కొనియాడారు. ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో సూరారంలోని మ‌ల్లారెడ్డి ఆస్ప‌త్రి స‌మీపంలో నిత్యం ఉద‌యం పేద‌ల‌కు అందిస్తున్న బ్రేక్ ఫాస్ట్ కార్య‌క్రమం ఐదు సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఐదేళ్ళ నుంచి చేస్తున్న సేవ‌ల‌కు గుర్తింపు గాను ప్ర‌త్యేక జ్ఞాపిక‌ను డిస్ట్రిక్ట్ గ‌వ‌ర్న‌ర్ సెల్వా సాయిరాంరాజ్ సికింద్రాబాద్ నార్త్ అధ్య‌క్షుడు బిర్రు ఆంజ‌నేయులుకు అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఒక కార్య‌క్ర‌మాన్ని నిరంత‌రాయంగా ఐదేళ్ళ పాటు నిర్వ‌హించ‌డం గొప్ప‌విష‌యం అన్నారు. ఈ ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో కూడా నిరంత‌రాయంగా ఒక కార్య‌క్ర‌మం కొన‌సాగ‌డం లేద‌ని గుర్తు చేశారు. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ ను అందించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన మాజీ అధ్య‌క్షుడు కృష్ణ‌ను అభినందించారు. కార్య‌క్ర‌మంలో కౌన్సిల్ చైర్ ప‌ర్స‌న్ ల‌య‌న్ టి.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జిఈటి కోఆర్డినేట‌ర్ ఎస్ ఎన్ రెడ్డి, సెకండ్‌ వైస్ డిస్ట్రిక్ట్ గ‌వ‌ర్న‌ర్ అవంతిరెడ్డి, డిసి అంగ‌ర్ రిలిఫ్ రాందాస్‌, రిజియ‌న్ చైర్‌ప‌ర్స‌న్ సురేష్‌కుమార్‌, ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ సికింద్ర‌బాద్ నార్త్ అధ్య‌క్షుడు బిర్రు ఆంజేయులు , మాజీ అధ్య‌క్షులు కృష్ణ‌, కిషోర్‌, బి.శ్రీనివాస్‌రెడ్డి, వినోద్ జాద‌వ్‌, సిద్దారెడ్డి, సినియ‌ర్ ల‌య‌న్స్ క్ల‌బ్ స‌భ్యులు చ‌ల్లా శ్రీనివాస్‌రెడ్డి, బాషా తదిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here