ఒడిశాపై తెలంగాణ హైకోర్టు లాయ‌ర్స్ జ‌ట్టు విజ‌యం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేర‌ళ‌లోని కొచ్చిన్‌లో జ‌రుగుతున్న 28వ ఆలిండియా లాయ‌ర్స్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో భాగంగా ఒడిశా జ‌ట్టుపై తెలంగాణ హైకోర్టు లాయ‌ర్స్ జ‌ట్టు 57 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన తెలంగాణ హైకోర్టు లాయ‌ర్స్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 230 ప‌రుగులు చేసింది. ఉన్న‌మ్ కృష్ణ (21), ఒవాయిస్ (61 బంతుల్లో 92, 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), మ‌నోజ్ (32 బంతుల్లో 54, 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), రాహుల్ త‌పాడియా (8 బంతుల్లో 44, 2 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) రాణించారు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఒడిశా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 173 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌లో ల‌లిత్ (59), సిద్ధాంత్ (51) రాణించ‌గా, తెలంగాణ లాయ‌ర్స్ జ‌ట్టు బౌల‌ర్లు సాయిచంద్ (2/14), షాహిద్ హుస్సెయిన్ (2/34), రాజ‌గోపాల్ రెడ్డి (2/29) స‌త్తా చాటారు. ఒవాయిస్‌ను మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వ‌రించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here