శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కార్పొరేటర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొని చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజపేయి వ్యక్తి ఒక్కరే అయినా ఆయన వ్యక్తిత్వంలో అనేక విశిష్ట పార్శ్వాలు సమన్వయమయ్యాయి. సాధారణ బడిపంతుల కుటుంబంలో జన్మించి, మూడు సార్లు భారత ప్రధాని పదవిని చేపట్టి దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన అసాధారణ నాయకుడు ఆయన. సిద్ధాంతాలపై అచంచల విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, అవసరమైన చోట లౌకికత చూపిన రాజనీతిజ్ఞుడు. శత్రు దేశాలతో సైతం సంభాషణకు ద్వారాలు తెరిచి, శాంతి మార్గాన్నే ఆశ్రయించిన దూరదృష్టి గల నేతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు.

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్ రాందీన్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు వసంత కుమార్ యాదవ్, విఠల్, మూలగిరి శ్రీనివాస్, శేఖర్, కిషన్ గౌలి, తిరుపతి, రాథోడ్ , రాజు, శ్రీను, శ్రీకాంత్ రెడ్డి, నర్సింగ్ రావు, సురేష్, వెంకటేష్, దేవేందర్, యాదయ్య, నర్సింగ్ రావు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





