ప్రజలకు నమ్మకంగా సేవలందించింది కాంగ్రెస్ పార్టీయే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): రాష్ర ప్రజలకు నమ్మకంగా సేవలు అందించింది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి అరకల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్లగండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్నీ విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై ప్రారంభించారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని, రాష్ట్ర ప్రజలు మరోసారి కాంగ్రెస్ పాలనకు ఎదురుచూస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని పెంచే దిశగా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. గచ్చిబౌలి డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అయన కోరారు. ఈ కార్యక్రమం లో సుమన్ గౌడ్, బల్వంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, భీమని వెంకట కృష్ణ ముదిరాజ్ లతో పాటు డివిజన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here