శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): విపక్షాలకు తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే నైతికత లేదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రవీందర్ రెడ్డి గార్డెన్ లో యువనేత రాగం అనిరుధ్ యాదవ్, దుర్గం వీరేశంగౌడ్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఇంటింటికి తిరిగి నిత్యావసర సరుకులను అందించి ప్రజలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని అన్నారు.

ఏకధాటిగా కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులకు గురైతే సాయం చేస్తున్న తమపై ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై నోరు పారేసుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఎలాంటి నిధులు మంజూరు చేయకపోయినా, కోట్ల రూపాయల నిధులను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. వృద్ధాప్య, వితంతువు, వికలాంగుల ఫించన్లలో కేంద్రం అందించేది కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే అని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ రూ.2016 అందించి ప్రతి ఇంట్లో పెద్దదిక్కు గా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు తమ పార్టీకే ఉందని పేర్కొన్నారు.
నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యువత దీటుగా ఎదుర్కొని, ప్రజలకు నిజానిజాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆయన కోరారు. శేరిలింగంపల్లి డివిజన్ లో యువత కోసం పరితపించే నాయకుడు రాగం నాగేందర్ యాదవ్ ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్ పర్సన్ రాగం సుజాత, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్, సినీ డైరెక్టర్ లక్ష్మణ్, హబిబ్ భాయ్, రాంచందర్, రవీందర్ గౌడ్, నర్సింహ, కలివేముల వీరేశం గౌడ్, రవీందర్ యాదవ్, గోపాల్ యాదవ్, లక్మణ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, యశ్వంత్ యాదవ్ పాల్గొన్నారు.