డివిజ‌న్‌ను అభివృద్ధి చేశా, మ‌రోసారి గెలిపించండి: రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని పాత లింగంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ గౌరవాధ్యక్షుడు పొట్ట మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపల్లిలో ప్రైవేటు ఆసుపత్రుల‌కి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు.

పాత లింగంపల్లిలో తెరాస కార్యాల‌యాన్ని ప్రారంభిస్తున్న రాగం నాగేందర్ యాదవ్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చక్కటి నూతన భవన నిర్మాణం చేపట్టి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట‌లు వేయడం జరిగిందన్నారు. డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా పని చేసిన తనని ఆశీర్వదించి అధిక మెజారిటీతో మరోసారి గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. మ‌ల్లికార్జున్ యాద‌వ్‌ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ని అధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి డివిజన్ లో అఖండ విజయం సాధిస్తుంద‌ని, డివిజ‌న్‌లో సీటు గెలిచి సీఎం కేసీఆర్ కు కానుకగా అందిస్తామ‌ని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో రాగం నాగేందర్ యాదవ్

ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు రవి యాదవ్, టీఆర్ఎస్ నాయకులు కొయ్యాడ లక్ష్మణ్, మల్లేష్ గౌడ్, రాజశేఖర్ యాదవ్, మైనారిటీ నాయకులు నిజాం భాయ్, గఫార్, అజీం, కిరణ్, మాణిక్యం పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here