వాహ‌న‌దారులు ట్రాఫిక్ నియ‌మాల‌ను పాటించాలి: మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వాహ‌న‌దారులు ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వాహ‌నాల‌ను న‌డిపించాల‌ని, ట్రాఫిక్ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్ కోరారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌, శ్రీ‌క‌ర హాస్పిట‌ల్‌, ఆల్విన్ జంక్ష‌న్‌, మియాపూర్ ఎక్స్ రోడ్డు ప్రాంతాల్లో ఏబుల్‌-4 ఆఫీస‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రాఫిక్ పోలీసులు ర‌హ‌దారి భ‌ద్ర‌త‌, హెల్మెట్ వాడ‌కం, సీట్ బెల్ట్ ధ‌రించ‌డం, పాద‌చారుల భ‌ద్ర‌త త‌దిత‌ర అంశాల‌పై వాహ‌న‌దారుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్ మాట్లాడుతూ ద్విచ‌క్ర వాహ‌న‌దారులు త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌ని అన్నారు. కారులో ప్ర‌యాణించే వారు సీట్ బెల్ట్‌ను విధిగా పెట్టుకోవాల‌ని సూచించారు. పాద‌చారులు సైతం ర‌హ‌దారులు దాటేట‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here