జగద్గిరి గుట్ట సగర సంఘం అభివృద్ధికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని జగద్గిరి గుట్ట సగర సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.10 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే SDF FUNDS నిధులతో నిర్మించడానికి గాను నిధుల మంజూరు కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పంపిన మంజూరు పత్రాలను జగద్గిరి గుట్ట సగర సంఘం అసోసియేషన్ సభ్యులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అంద‌జేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జగద్గిరి గుట్ట సగర సంఘం అభివృద్ధి లో భాగంగా సగర సంఘం సభ్యుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం SDF ఫండ్స్ ద్వారా మొత్తం రూ.10 లక్షల ఎమ్మెల్యే SDF FUNDS నుండి మంజూరు చేయవలసిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ప్రతిపాదనలు పంపడం జరిగింద‌ని అన్నారు. నిధులు మంజూరు కాగానే కమ్యూనిటీ హాల్ ను త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. చిన్న చిన్న సమావేశాలు, సభలు, ఫంక్షన్ లు నిర్వహించుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్ ను నిర్మించ‌డం  సంతోషంగా ఉందన్నారు. జగద్గిరి గుట్ట సగర సంఘం అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, జగద్గిరిగుట్ట సగర (ఉప్పర ) సంఘం నూతన అధ్యక్షుడు వేముల సుదర్శన్ సాగర్ , ప్రధాన కార్యదర్శి భీమయ్యా సాగర్, కోశాధికారి వెంకట రమణ , స్టీరింగ్ సభ్యులు రాములు, శ్రీనివాస్, సత్యనారాయణ, గంగాధర్, దయాసాగర్, రామకృష్ణ, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, బాల్ రాజు, కృష్ణ మురళి, చంద్రశేఖర్, వెంకటేష్, ఆంజనేయులు, చంద్రమోహన్, శివ సాగర్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here