శేరిలింగంపల్లి, డిసెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఇంచార్జ్ అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను అంబర్ పేట్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యువత, నాయకులు, కార్యకర్తలతోపాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి హరికృష్ణ చారి పాల్గొని శ్రీనివాస్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జీవితంలో ఇంకా మరెన్నో పదవులను అధిరోహించాలని, ఇంకా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నింటినో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.






