హుడా కాల‌నీలో ప్ర‌భుత్వ స్థ‌లాన్ని ర‌క్షించాల‌ని విన‌తి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హుడా కాల‌నీలో ఉన్న ప్ర‌భుత్వ స్థ‌లాన్ని ఆక్ర‌మ‌ణ‌ల నుంచి ర‌క్షించాల‌ని కోరుతూ డిప్యూటీ క‌మిష‌న‌ర్ డి.శ‌శిరేఖ‌కు బీజేపీ హ‌ఫీజ్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త సోమ‌వారం ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ స‌ద‌రు ప్ర‌భుత్వ స్థలంలో కొంద‌రు అక్ర‌మంగా నిర్మాణాల‌ను నిర్మించి వ్యాపారాల‌ను కొన‌సాగిస్తున్నార‌ని అన్నారు. కొంద‌రు అక్ర‌మ నిర్మాణాల‌కు అద్దెలు వ‌సూలు చేస్తున్నార‌ని, వ్యాపారాల వ‌ల్ల స‌మీపంలో ఉన్న ర‌హ‌దారిపై తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్ప‌డి వాహ‌న‌దారులు, ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని అన్నారు. వెంట‌నే అక్ర‌మ నిర్మాణాలు, వ్యాపారాల‌ను తొల‌గించి ప్ర‌భుత్వ స్థ‌లాన్ని క‌బ్జాల నుంచి కాపాడాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమణయ్య, బీజేపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రాజు, పాలం శ్రీనివాస్, వెంకటేష్ ముదిరాజ్, రామ్ రెడ్డి, వినయ్, అమర్నాథ్ రెడ్డి, కృష్ణ, దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here