శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో బెరాకా చర్చి లో పాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీక్రిస్మస్ వేడుకలలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రమేష్ పాస్టర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, అందరి మధ్యలో కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణ లతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని , చాలా పవిత్రమైన పండుగ అని అన్నారు. పండుగ ను చక్కటి వాతావరణం లో శాంతి యుతంగా కుటుంబ సభ్యుల మధ్య ఆనంద దాయకంగా , సంతోషకరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదేశ్ కుమార్, నిఖిల్, పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.






