చందాన‌గ‌ర్‌లో ఘ‌నంగా అయ్య‌ప్ప స్వామి మ‌హాప‌డి పూజ

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలో ఉన్న చందాన‌గ‌ర్ హుడా కాల‌నీ రైల్వే స్టేష‌న్ 2వ లైన్ హ‌నుమాన్ ఆల‌య వీధిలో శ్రీ అయ్య‌ప్ప స్వామి మ‌హాప‌డిపూజ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. నిర్వాహ‌కులు జి.రోహిత్ ముదిరాజ్‌, జి.సాయిచ‌ర‌ణ్ ల ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో గురుస్వాములు బాలు, శ్రీ‌మ‌ణికంఠ భజ‌న మండ‌లి వాస‌గిరి ప్ర‌సాద్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పూజ‌ల్లో ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన అయ్య‌ప్ప స్వాములు, భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు. అనంత‌రం అన్నదాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here