జనప్రియ అపార్ట్‌మెంట్స్ అసోసియేషన్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: బాలింగ్ గౌతమ్ గౌడ్

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హ‌ఫీజ్‌పేట డివిజన్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ కాల‌నీలో ప‌ర్య‌టించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అపార్ట్‌మెంట్ వాసుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, ఇతర స్థానిక ఇబ్బందుల గురించి అసోసియేషన్ సభ్యులు ఆయనకు వివరించారు. ఈ సమస్యలను వెంటనే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తానని గౌతమ్ గౌడ్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, గురు ప్రసాద్, మృదుల, ఉమా, మీనాక్షి, కృపాకర్ రెడ్డి, నరేష్, రమేష్, లడ్డు, కాలనీ వాసులు, అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here