శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ శ్రీరామ్ నగర్ బి బ్లాక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ నీరజ ఫెర్టిలిటీ హాస్పిటల్ ను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నీరజ, కిరణ్, నాయకులు చాంద్ పాషా, అనిల్ యాదవ్, మల్లేష్ యాదవ్ , మల్లేష్ గౌడ్, పవన్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.






