శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బీసీ ఐక్యవేదిక నాయకుడు, ముఖ్య సలహాదారుగా నియమితులైన పట్లూరి కృష్ణమోహన్ కి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. నియమితులైన కృష్ణమోహన్ బిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంఘాల బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. సంఘాల వారికి న్యాయం చేకూరుస్తానని, వారికి ఏ సమస్యలు వచ్చినా రాష్ట్ర కమిటీ తరఫున సంప్రదించి వారికి సరైన న్యాయం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ చారి, బీసీ నాయకులు పాల్గొన్నారు.






