శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు, అయ్యప్ప దీక్ష గురు స్వామి మారోజు ప్రభాకర్ చారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల బృందం శబరిమలకు పాదయాత్రగా బయలుదేరింది. బీహెచ్ఈఎల్ లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడులు కట్టుకున్న ప్రభాకర్ చారి బృందం స్వాములు అక్కడి నుండి శనివారం తారానగర్ తుల్జాభవాని ఆలయం వరకు మొదటి రోజు పాదయాత్ర కొనసాగించారు. ఆదివారం తిరిగి పాదయాత్ర కొనసాగుతుందని స్వాములు తెలిపారు.






