శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ పాఠశాలలో పోషక పదార్థాల తో కూడిన ఆహారం ఇచ్చి వారి ఆరోగ్యాలను కాపాడవలసింది పోయి చంద్రనాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో 44 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి హాస్పిటల్ పాల్ అయ్యారని, రెండు రోజులు గడుసున్నప్పటికీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి, రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి విద్యార్థులను పరామర్శించి మాట్లాడుతూ అక్షయపాత్ర వాళ్లు సప్లై చేస్తున్నారా, లేక అక్కడనే తయారు చేస్తున్నారా అని సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎంతటి వారైనా వెంటనే శిక్షించాలన్నారు. కోటి ఆశలతోటి తల్లిదండ్రులు తమ పిల్లలకు విజ్ఞానం బోధిస్తారని నాణ్యమైన ఆహారం ఇస్తారనే ఆశతో పాఠశాలకి పంపితే వారి ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ ఉపాధ్యక్షుడు తుపాకుల రాములు, బి. నారాయణ, శేరిలింగంపల్లి సిపిఐ కార్యవర్గ సభ్యుడు ఎస్.కొండలయ్య, డి హెచ్ పి ఎస్ మండల కార్యదర్శి పాల్గొన్నారు.






