శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నయ వంచన చేశాయని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు ఆరోపించారు. బషీర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్ అధ్యక్షత వహించగా అతిథులుగా హాజరైన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ టి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ 42శాతం బీసీ రిజర్వేషన్లకు మూడు పార్టీలు మాటల్లో మద్దతు ఇచ్చాయని, కానీ చేతుల్లో నయవంచన చేశాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పై బిజెపి , బిఆర్ఎస్ పార్టీలు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్ల నుంచి బీసీల విషయాన్ని ప్రక్కదారి పట్టించడానికే గ్లోబల్ సమ్మిట్ , మెస్సీ ఫుట్ బాల్ కార్యక్రమాలను నిర్వహించారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్ దుర్గ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్, యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బైరు శేఖర్ , బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ నాయకుడు చామకూరి రాజు , బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నాగేష్ గౌడ్ , అవ్వరు వేణు , కెవి గౌడ్ , దామోదర్ గౌడ్ , రాష్ట్ర కార్యదర్శి గోలి గిరి , నాగభూషణం , అనుమాస సుధాకర్ , చెన్న శ్రీకాంత్ నేత, లింగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





