శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ లో మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, మల్లారెడ్డి, సంగా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అల్లావుద్దీన్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ లో మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా తయారైందని, శేరిలింగంపల్లి డివిజన్ ను 3 డివిజన్లుగా విభజన జరగడం వలన 3 డివిజన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తాం అని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో GHMC ఎలక్షన్స్ వస్తాయని, డివిజన్ కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలు అందించాలని, అందరూ కలిసి కట్టుగా పని వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో dr. రవి కుమార్ యాదవ్, వెంకట్ రెడ్డి, సాయి నందన్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలం యాదవ్, సంతోష్ ముదిరాజ్, బాల రాజ్ గౌడ్, md గౌస్, అనంత రెడ్డి పాల్గొన్నారు.






