శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం వలన బాలబాలికలు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ వారిని పరామర్శించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పాఠశాలకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వలన ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. బయట నుండి వచ్చే ఆహారంపై ఎలాంటి ఆంక్షలు లేనందువలన ఇష్టారాజ్యంగా నాసిరకమైన కలుషితపు ఆహారం తెచ్చి పిల్లలకు పెడుతున్నారని ఆరోపించారు. ఆ ఆహారాన్ని వారు తిని అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బందిపై, ఆహారాన్ని సరఫరా చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను నాయక్, సుమన్ నాయక్, రాము యాదవ్, మల్లేష్, శివ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.






