అల్లావుద్దీన్ పటేల్ కొండాపూర్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నారు: మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు అల్లావుద్దీన్ పటేల్ ఆర్ధిక సహకారంతో ప్రేమ నగర్ బ్లాక్ 2 అభయ ఆంజనేయ స్వామి దేవాలయానికి రూ.50,000 ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, మారబోయిన రవి యాదవ్, మల్లారెడ్డి, సంగా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ అల్లావుద్దీన్ మైనారిటీ అయి ఉండి హిందూ దేవాలయానికి ఆర్ధిక సహాయం చేయటం చాలా గొప్ప విషయం అని అన్నారు. కొండాపూర్ డివిజన్ లో ప్రజలకు చేస్తున్న సహాయ సహకారాలు గర్వించద‌గిన‌ విషయం అని, మునుముందు కొండాపూర్ డివిజన్ ప్రజలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్, బాల్ రాజ్, గౌస్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here