న్యూ శక్తి దివ్యాంగుల సంస్థలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూక‌ట్‌ప‌ల్లిలోని ఐడీఎల్ చెరువు వ‌ద్ద న్యూ శక్తి దివ్యాంగుల సంస్థ అధినేతలు వెంకటస్వామి, చిరంజీవి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్య‌లో దివ్యాంగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే అకాల మ‌ర‌ణం చెందిన‌ సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామానికి చెందిన పెద్దగొల్ల పార్వతమ్మకు నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఆమె జ్ఞాపకార్థంగా ఆమె కుమారులు పెద్దగొల్ల నాగరాజు, నరసింహులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ న్యూ శక్తి దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా తమతల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం న్యూ శక్తి దివ్యాంగుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here