శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మసీద్ బండ కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కొండాపూర్ డివిజన్ సంబంధించిన మహిళా మోర్చా డివిజన్ అధ్యక్షురాలిగా నియమితులైన సరోజ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్ , మహిళా మోర్చా కన్వీనర్ పద్మ, డివిజన్ అధ్యక్షుడు అరవింద్, మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, మహిళా మోర్చా నాయకురాలు మేరీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళలంతా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో మహిళల హక్కుల కోసం, మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు మహిళలంతా కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా డివిజన్ ఉపాధ్యక్షురాళ్లుగా సుప్రజ, రెడ్డమ్మ,లావణ్య, జనరల్ సెక్రటరీలుగా పద్మజ, మంజు, సెక్రటరీలుగా నాగమణి, బుజ్జమ్మ, ట్రెజరర్ గా అంజలి, అండాలమ్మ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమితులయ్యారు.






