శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని గుల్మొహార్ పార్క్ కాలనీ వద్ద ప్రముఖ వ్యాపారవేత్త లీగల గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ ఎల్ ప్రవీణ్ రెడ్డి జన్మదినం సందర్బంగా రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్ ఆయనని శాలువాతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేయించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా రాగం అనిరుధ్ యాదవ్ మాట్లాడుతూ ప్రవీణ్ రెడ్డిపై ఎల్లప్పుడూ జీవితంలో అందరు దేవుళ్ల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, లింగంపల్లి విలేజ్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.






