ప్రజలు ఏకమైతే చరిత్రలు మారుతాయి: కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు డిసెంబర్ 9న విజయ్ దివ‌స్ సందర్భంగా మంగళవారం ఉదయం రిక్షా పుల్లర్స్ కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు అంబేద్కర్ విగ్ర‌హానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పడ్డ తొలి అడుగు విజయాన్ని సూచిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలతో కలిసి పింక్ బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డిసెంబర్ 9 అనేది తెలంగాణ చరిత్రలో ఒక అపూర్వమైన రోజు అని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన‌ తరువాత ప్రతిస్పందనగా అమరుల త్యాగాలు, కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంద‌ని అధికారికంగా ప్రకటించార‌ని తెలిపారు.

డిసెంబర్ 9 మనకు నేర్పిన గొప్ప పాఠం అని, ప్రజలు ఏకమైతే చరిత్రలు మారుతాయ‌ని అన్నారు. హక్కుల కోసం నిలబడ్డప్పుడు ప్రభుత్వాలు తల వంచుతాయి అని కార్పొరేటర్ అన్నారు. మన ఉద్యమానికి వచ్చిన ఫలితాన్ని గౌరవిస్తూ, మన తెలంగాణను అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కుల పెద్ద భాస్కర్ రావు, జగదీష్ గౌడ్ , వేముల ఆంజనేయులు, ప్రవీణ్, యశ్వంత్ , కృష్ణారావు, సత్యనారాయణ, విక్రమ్, మోహన్ రావు, యాదగిరి, వాసు, రామచందర్, రామ్మూర్తి, అనిల్, శ్రీనివాస్ , శంకర్, లక్ష్మణ్, రవి, బాబు, కొండలరావు, రాజు, రాజశేఖర్, శ్రీను, జై, రమేష్ రావు, హరి, కిరణ్, నాగేష్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, రాజు, కె.వి. రావు, యూసుఫ్, కుమార్ యాదవ్, ఆనంద్, హరీష్, నవీన్, శ్రీరామ్, మోహన్ చారి, అనిల్, సురేష్, సంతోష్, హరి, వెంకటేశ్వరరావు, సాయి, నరేష్, అప్పు, బాబు, వినోద్, మాధవి రెడ్డి, శైలజ, రాధిక, అనిత, అనురాధ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here