శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని విస్తరించి, వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి పెంచుతూ ఆదేశాలు జారీ చేసిందని, దీనికి సంబంధించి 266 జీవోను విడుదల చేసిందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ విస్తరణతో శివారు ప్రాంతాలలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు GHMCలో విలీనం అవుతాయని అన్నారు. దీంతో సర్కిళ్ల సంఖ్య 57కి చేరిందని, జనాభా 1.3 కోట్లకు పైగా పెరుగుతుందని అన్నారు. దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, ఆయన ధైర్య సాహసాలకు ఇది నిదర్శనమని అన్నారు. ఈ సందర్బంగా సీఎంని కలిసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.






