పీఆర్టీయూ టీఎస్ జిన్నారం మండ‌ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జీవీజీకే ప‌వ‌న్ రాజు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రొగ్రెసివ్ రిక‌గ్నైజ్డ్ టీచ‌ర్స్ యూనియ‌న్ తెలంగాణ స్టేట్ (పీఆర్టీయూ టీఎస్) సంగారెడ్డి జిల్లా శాఖ ప‌రిధిలోని జిన్నారం మండ‌ల శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌హిస్తున్న బి.కృష్ణాగౌడ్ న‌వంబ‌ర్ 30వ తేదీన ప‌ద‌వీ విమ‌ర‌ణ పొందిన నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో జీవీజీకే ప‌వ‌న్ రాజు నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు పీఆర్‌టీయూ టీఎస్ జిన్నారం మండ‌ల శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌వ‌న్‌రాజును నియ‌మిస్తూ సంఘం జిల్లా అధ్య‌క్షుడు ఎ.మాణ‌య్య‌, జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆకుల ప్ర‌భు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు ప‌వ‌న్ రాజు వారి చేతుల మీదుగా నియామ‌క‌పు ప‌త్రం అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అనిల్ కుమార్‌, ప‌టాన్‌చెరు అధ్య‌క్షుడు విఠ‌ల్ రెడ్డి, బ్రహ్మ ఋషి, మొగులయ్య, రామానుజన్, సత్య నారాయణ, దావునూరి రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here